Friday, 6 November 2026

ఇప్పుడు నడుస్తున్నది కెసిఆర్‌ విప్లవం

రైతుబంధుతో కాంగ్రెస్‌ వారు రాబందులయ్యారు: బాల్క
హైదరాబాద్‌,మే19( జ‌నం సాక్షి):  రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు పథకానికి అనూహ్య స్పందన వచ్చిందని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్కసుమన్‌ అన్నారు. అయితే కాంగ్రెస్‌ నాయకులు మాత్రం విషాదంలో ఉన్నారన్నారు. ఈ పథకంతో ప్రజలు ఆత్మబంధువులైతే… కాంగ్రెస్‌ నేతలు రాంబందులయ్యారని విమర్శించారు. ఉత్తమ్‌ మాటలు తుపాకీ రాముణ్ణి గుర్తుచేస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నడుస్తున్నది కేసీఆర్‌ విప్లవమని ఎంపీ తెలిపారు. ప్రాణహిత ప్రాజెక్టుకు అంబెద్కర్‌ పేరు మార్చలేదన్నారు. ప్రాణహిత గ్రావిటీ ప్రాజెక్ట్‌ అని దీనిపై చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. తాను చెప్పేది తప్పైతే లిబర్టీ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తానని… ఉత్తమ్‌ది తప్పు అయితే కనీసం గాంధీ భవన్లో ముక్కు నేలకు రాస్తాడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలో కౌలు రైతులను పట్టించుకున్నారా అని నిలదీశారు. కౌలురైతులకు, భూయజ మానులకు మధ్య చిచ్చు పెట్టాలన్నదే కాంగ్రెస్‌ ఆలోచన అని ఎంపీ బాల్కసుమన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇతర రాష్ట్రాల రైతులు కూడా అక్కడ రైతుబంధు లాంటి పథకాన్ని కోరుకుంటున్నారని ఎమ్మెల్సీలు గంగాధర్‌ గౌడ్‌, భానుప్రసాద్‌ రావు తెలిపారు. కానీ తెలంగాణ ప్రతిపక్ష నాయకులు అర్థరహితమైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా పద్దతి మర్చుకుని ప్రభుత్వం చేసే మంచి పనులను విమర్శంచకపోతే బాగుంటుందని సలహా ఇచ్చారు.
———-