త్యాగ నదిలో మునిగి తేలుతున్న మనుషులు కొద్ది మందే ఉంటారు
నీవు ఎప్పుడు లోకం పక్షాన వాదించే వకీలు
వ్యవస్థ ముఖచిత్రం దానిలోని పగుళ్ళు అన్నిటిని గమనించిన వాడివి
సామాన్యునికి న్యాయం అందించే న్యాయ తీర్పరివి త్రాసు నీ వాక్యాలు ఎప్పుడు సామాన్యులను
కొత్త లోకం వైపు నడిపించే శక్తులు సామాన్యుని యొక్క జీవితమే నీ తీర్పుల్లో ప్రతిబింబమే
జాతి అంతా నిర్వీర్యమైనప్పుడు నీ మాటలే చైతన్యపు అశ్వాలు
ప్రజా బలమే జీవనం సాగిస్తున్న నీవు నాటి నుంచి నేటిదాకా ప్రజలే సమస్తమని తలచిన వాడిని సామాన్యుని గుండెలో నిద్రపోయిన వాడి సామాన్యుని మేల్కొల్పినదే నీ తీర్పు నీ మార్పు నీ వాక్కు
రేపు న్యాయ చరిత్రలో నీ పేజీ ఎప్పటికి శిలాశాసనం నిలుస్తూనే ఉంటుంది ఆదర్శ బాటై నిలుస్తూనే ఉంటుంది
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట 7702537453
|
ReplyForward
|




