Thursday, 5 November 2026

ఇల్లు లేని అర్హులైన వారికి రెండు పడక గదులు మంజూరు చేయాలి

ఇల్లు లేని అర్హులైన వారికి రెండు పడక గదులు మంజూరు చేయాలి రోడ్డుపై బైఠాయించిన అనర్హులు అర్హుల కొరకు తెలంగాణ ప్రభుత్వం రెండు పడక గదుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కానీ అర్హులకి కాకుండా అనర్హులకే ఇండ్లను కేటాయిస్తున్నారని డాకూర్ గ్రామస్తులు బుధవారం జోగిపేట తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మండలం డాకూర్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూంల గోల మొదటి నుండి వివాదాస్పదంగా ఉందని చెప్పొచ్చు. అర్హులైన నిరుపేదలకు ఇండ్లను కేటాయించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులకు ఆదేశిస్తున్నారు. కానీ అవేవీ ఆయన మాట అమలు కావడం లేదని నిరుపేద అర్హుల నుండి విమర్శలు గుప్పమంటున్నాయి.

డాకూర్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలో ఇండ్ల పంపిణీ కార్యక్రమం మొదట లాటరీ పద్ధతిలో డ్రా తీశారు. అర్హులకి కాకుండా అనర్హుల పేర్లు జాబితాలో రావడంతో అప్పట్లో అధికారులకి ఈ సమస్య తలనొప్పిగా మారింది. దీంతో చేసేదేమీ లేక మంత్రి, కలెక్టర్ ఆదేశాల మేరకు తిరిగి ఆ ఇండ్ల పంపిణీ కొరకు అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు కొత్తగా సర్వే సైతం చేశారు.

అంతా సిద్ధంగా ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారయింది డాకుర్ డబుల్ బెడ్రూంల పరిస్థితి అని ప్రతిపక్ష నేతలు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఇండ్ల పంపిణీ ప్రక్రియలో జపం ఒకవైపు అయితే అనారులకే ఇండ్లుకేటేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ బుధవారం డాకుర్ గ్రామస్తులు న్యాయం కొరకు ఎమ్మార్వో కి వినతి పత్రం అందించాలని నినాదాలతో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. కానీ తహసిల్దార్ స్పందించకపోవడంతో అధికారుల నిర్లక్ష్య తీరుకు నిరసనగా నాందేడ్ అకోలా ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకి దిగారు. డబుల్ బెడ్ రూమ్స్ కోసం ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న జోగిపేట పోలీసులు వారి వద్దకు వచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అవేవీ వినకపోవడంతో గ్రామస్తులకు పోలీసులకు మధ్య తోపులాట వాగ్వాద పరిస్థితి నెలకొంది.

దీంతో పోలీసులు ధర్నా చేస్తున్న డాకూర్ గ్రామస్తులు తో పాటు నాయకులను జోగిపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్లో గ్రామస్తులు న్యాయం కోసం ధర్నా చేస్తున్నాం అనడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని పోలీసులు చెబుతున్న వారు మొండికేసిన పరిస్థితి జోగిపేటలో చోటుచేసుకుంది.

మరి డాకూర్ డబుల్ బెడ్రూమ్స్ అర్హులకా. అనర్హులకు అందుతాయా.? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా పంపిణీ చేసినంత వరకు వేచి చూడాల్సిందే.!