ఇల్ల స్థలాల కోసం ఇచ్చిన భూమి కి సర్వే చేసి బౌండరి ఏర్పాటు చేసిన అధికారులు

కోడేరు (జనం సాక్షి) అక్టోబర్ 01 కోడేరు మండల పరిధిలోని ఎత్తం గ్రామంలో 1996లో ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేసిన పోరాట ఫలితంగా ప్రభుత్వ సర్వేయర్ రాములు ఆర్ ఐ జానయ్య, లు సర్వే చేసి శనివారం రోజు హద్దులు నిర్ణయిస్తున్న దృశ్యం.
ఈ కార్యక్రమంలో ఎత్తం గ్రామం సర్పంచు సాయిని వరలక్ష్మి,ప్రజా సంఘాల నాయకులు వి రవి, వి రాజేష్, ఎన్ శ్రీకాంత్,స్థానిక ప్రజా సంఘాల నాయకులు షాగాది నిరంజన్, పి రామచంద్రి, బి శ్రీను, బాల పీరు లబ్ధిదారులు ప్రజలు తదీతరులు పాల్గొన్నారు.