హైదరాబాద్: సనత్‌నగర్ నియోజకవర్గంలోని కస్తూర్భా నగర్‌లో ఇవాళ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా 90 మంది నిరుపేదలకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురికివాడల్లో నివసిస్తున్న ప్రతీ ఒక్కరికీ పక్కా ఇల్లు నిర్మిస్తమని స్పష్టం చేశారు. ఇప్పటికే అర్హులైనవారికి పెన్షన్లు అందిస్తున్నమని.. పేదల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు తెస్తున్నారు. మురికివాడల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.




