*ఇళ్ల స్థలాల సాధనకు సమిష్టిగా కృషి చేయాలి*.
కోదాడ, ఆగస్టు23(జనంసాక్షి) ది కోదాడ జర్నలిస్ట్స్ కో- ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు ఇళ్ల స్థలాల సాధనకు సమిష్టిగా కృషి చెయ్యాలని సొసైటీ అధ్యక్షుడు కారింగుల రామాంజనేయులు కోరారు. నూతన కమిటీ ఎన్నిక తరువాత మంగళవారం కోదాడ పట్టణంలోని మార్కెట్ కమిటీ గెస్ట్ హౌస్ లో జరిగిన సొసైటీ తొలి సమావేశంలో ఆయన మాట్లాడారు. సొసైటీ సభ్యులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రధాన కార్యదర్శి వంగవీటి శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులు పడిశాల రఘు,డైరెక్టర్ లు పల్లా రామకృష్ణ, ఆవుల మల్లికార్జున రావు, కోట రాంబాబు,వెన్నబోయిన పూర్ణ చందర్రావు ,షేక్ నజీర్,లావుడ్యా రమేష్, కుడుములు సైదులు, సభ్యులు-: గింజల అప్పిరెడ్డి, అక్కిరాజు సంపత్, పిడమర్తి గాంధీ, శ్రీకాంత్, నాగరాజు, సత్యరాజు, లక్ష్మణ్, సురేష్, సైదులు, మురళి,బాదే రాము తదితరులు పాల్గొన్నారు