హైదరాబాద్: ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. పీఎస్‌ఎల్వీ సీ 27 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందించారు. ఇవాళ పీఎస్‌ఎల్వీ సీ 27 ప్రయోగం విజయవంతం కావడంపై ఆయన స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషికి ఈ విజయం తార్కాణమన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కాగా, ఇవాళ సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ దావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఇస్రో ఛైర్మన్ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో పీఎసీఎల్వీ సీ 27 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే.





