ఇస్లాం మత ప్రవక్త పై అసభ్య పదజాలంతో దూషించిన రాజా సింగ్ చర్య కోరుతూ డిఎస్పీకి ఫిర్యాదు
సంపాదించిన విద్యార్థికి సన్మానం
*రాజా సింగ్ దిష్టిబొమ్మ దగ్ధం *రాజా సింగ్ దిష్టిబొమ్మ దగ్ధం మిర్యాలగూడ. జనం సాక్షి , ఇస్లాం మత ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లలాహు అలైహి వసల్లం పై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే పి.రాజాసింగ్ ను రిమాండ్ కు పంపాలని కోరుతూ మంగళవారం మిర్యాలగూడలో ముస్లిం, దళిత సంఘాల నాయకులు స్థానిక డిఎస్పీ వై.వెంకటేశ్వరరావు కు ఫిర్యాదు చేశారు. స్థానిక మస్జిద్ ఉమర్ ఫారుక్ నుండి బైకులపై ర్యాలీగా పోలీసు సబ్ డివిజన్ కార్యాలయానికి వచ్చి వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ చట్టసభ సభ్యుడిగా ఉండి చట్టవిరుద్ధంగా ముస్లింల మనోభావాలను దెబ్బ తినేలా ప్రవక్త పై రాజా సింగ్ దుర్మార్గం గా వ్యాఖ్యానించారని అన్నారు. ప్రపంచానికి శాంతి, సోదరభావం, సామాజిక న్యాయం, ఆడపిల్లల పరిరక్షణ, మహిళలకు ఆస్తి హక్కు, గౌరవం కల్పించిన మహాప్రవక్తను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. మిర్యాలగూడలో రాజాసింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, ఎంపిటిసిల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జం సాయి, గురుకుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు వజ్రగిరి అంజయ్య, నీలకంఠ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి సమీఖాద్రి, పరంగిరాము, ముఫ్తీ ఇమ్రాన్, ముఫ్తీ ఉమర్, మౌలానా అతీఖుర్రహ్మాన్, మునిసిపల్ కౌన్సిలర్లు ఎంఎం.సలీం ఖాద్రీ, జాని క్రికెటర్, ఇలియాస్, ఎంఏ.గని, మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ మగ్దూంపాషా, జర్నలిస్టు అస్లాం, మస్జిద్ కమిటీ అధ్యక్షులు మహిమూద్ అలీ, బాబు జాని, ఖాజా హమీదుద్దీన్, వివిధ పార్టీల నాయకులు రెహ్మాన్ ఖాన్, మధార్ బాబా, ఎంఎం.హైఖాద్రీ, ఎండి.షోయెబ్, ఘయాస్, షారుఖ్, యునుస్ సలీం, షేక్ అజ్హరుద్దీన్ లు పాల్గొన్నారు. అనంతరం రాజీవ్ చౌక్ వద్ద రాజా సింగ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.