Monday, 2 November 2026

ఈజిప్టులో ఉగ్ర దాడి.. 30మంది భద్రతా సిబ్బంది మృతి

హైదరాబాద్‌ : ఈజిప్టులో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో భద్రతా దళాలకు చెందిన దాదాపు 30 మంది మృత్యువాత పడ్డారు. ఈజిప్టులోని ఉత్తర సినాయిలో చెక్‌ పాయింట్లపై దాడి చేసి సైనికుల్ని పొట్టనబెట్టుకున్నారని సైనిక అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఐదు చెక్‌పాయింట్లపై దాదాపు 70 మంది ఉగ్రవాదులు మారణాయుధాలతో విరుచుకుపడ్డారని తెలిపారు. ఎదురుకాల్పుల్లో 10 మంది సిబ్బంది, 22మంది ఉగ్రవాదులు మరణించారన్నారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌పై జరిపిన మరో దాడిలో 20మంది భద్రతా సిబ్బంది మృతి చెందారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *