Thursday, 5 November 2026

ఈటల రాజేందర్ ను పరామర్శించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 29
తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరమ్ అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఉద్యమకారుల ఫోరమ్ ఆధ్వర్యంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తండ్రి ఈటెల మల్లయ్య ఇటీవల మృతి చెందిన నేపధ్యంలో కమలాపూర్ లోని ఆయన నివాసంలో మల్లయ్య చిత్ర పటానికి ఉద్యమ కారుల ఫోరమ్ అధ్యక్షులు చీమ శ్రీనివాస్ పూలు వేసి నివాళులర్పించి. ఈటెల రాజేందర్ ను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో ఫోరమ్ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల సురేందర్ రెడ్డి. ఉపాధ్యక్షులు విరాస్వామి, అధికార ప్రతినిధి కంటి సాయన్న, రాష్ట్ర కమిటి నాయకులు.విష్ణువర్ధన్, వెంకటేష్ గౌడ్, నర్సింహాగౌడ్, కరీంనగర్ అద్యక్షులు కుమారస్వామి తదితరులు హాజరయ్యారు.