ఈతకు వెళ్లి 14 ఏళ్ళ బాలుడు మృతి

జహీరాబాద్ అక్టోబర్ 13 (జనంసాక్షి) ఈతకు వెళ్లి 14 ఏళ్ళ బాలుడు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం జహీరాబాద్ మండల పరిధిలోని పస్తపూర్ గ్రామంలో బండమీది ప్రశాంత్ (14) అనే బాలుడు మధ్యాహ్నం గ్రామంలో ని నారింజ వాగు దగ్గరకు ఇత కోసం తన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళాడు అని తెలిపారు. దింతో ఈతకు వెళ్లిన బాలుడు ఈత ఆడుతూ ఉండగా ఇంతకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు గ్రామంలో లోకి వచ్చి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి చూడగా బాలుడు వాగులో ఉన్నట్లు తెలియడం తో బంధువులు స్నేహితులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.