Tuesday, 3 November 2026

ఈద్గా మంజూరుపై ముస్లిం ప్రజలు హర్షం

వనపర్తి టౌన్,జూలై 08 (జనంసాక్షి) : వనపర్తి పట్టణంలో నాగవరం శివారులో ఈద్గా మంజూరుపై వనపర్తి గాంధీ చౌక్ లో శుక్రవారం నమాజ్ అనంతరం వనపర్తి ముస్లిం ప్రజలు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ప్రజల యొక్క భవిష్యత్ అవసరాల కొరకు ముందే పక్కా ప్రణాళికలతో ముస్లిం విద్యార్థుల కొరకు విద్యాలయాల నిర్మాణం,పేద ముస్లింల వివాహ,శుభకార్యాల నిమిత్తం నియోజకవర్గంలో నాలుగు షాదీఖానా ల నిర్మాణం,భవిష్యత్ తరాల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని తలపెట్టిన ఈద్గా మంత్రి నిరంజన్ రెడ్డి పేదల పక్షపాతి గా అభివర్ణించారు. ఇట్టి కార్యక్రమంలో వనపర్తిజిల్లా వక్ఫ్ ఆస్తుల రక్షణ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు షేక్ జహంగీర్,మహమ్మదీయ మజీద్ కమిటీ అధ్యక్షులు మైసన్,మాజీ మైనార్టీ సెల్ అధ్యక్షులు అజీజ్ ఖాన్,ముస్లిం మత పెద్దలు అబ్దుల్లా,జమీల్, హైదర్,మైసన్ ముస్లిం యువకులు మహమ్మద్, ఖదీర్,నవాజ్ తదితరులు పాల్గొన్నారు.