Thursday, 5 November 2026

ఈనెల 30న మాదిగల అలయ్ బలయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

జహీరాబాద్ అక్టోబర్ 14 ఈనెల 30న మాదిగల అలయ్ బలయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని మాదిగ జేఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బండి మోహన్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు జె.రవి కిరణ్ తెలిపారు. శుక్రవారం ఐబి గెస్టు హౌజ్ లో సమావేశంలో వారు మాట్లాడుతూ .మాదిగ జేఏసి వ్యవస్థాపకులు తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో హైదారాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లో జరగబోయే మాదిగల అలయ్ బలయ్ కార్యక్రమాన్ని మాదిగ సోదరులు మాదిగ విద్యార్థులు మాదిగ మేధావులు మాదిగ ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి విజయవంతం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు శివప్ప రాకేష్, తదితరులు పాల్గొన్నారు.