Wednesday, 4 November 2026

ఈనెల 31న సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ పై ఉన్న కట్ట మైసమ్మ అమ్మవారి బోనాలు

 ఆలయ కమిటీ చైర్మన్ మెర్ధ భాస్కర్ గంగపుత్ర
 ఎల్బీ నగర్ (జనం సాక్షి ) ఈనెల 31న సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ పై ఉన్న కట్ట మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మెర్ధ భాస్కర్ గంగపుత్ర తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించినట్లు తెలిపారు. 31న తెల్లవారుజామున నుండి భక్తులు బోనాలు సమర్పించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బోనాల ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోయిని మహేందర్ యాదవ్ , ఎస్, నాగరాజు భగవంతురాజ్ ,జై శంకర్ గౌడ్, శంకర్ యాదవ్ ,ఆనంద్ రాజ్ ,మధు గౌడ్, నర్సింగ్ గౌడ్, పురుషోత్తం రాజ్, శంకర్ గంగపుత్ర తదితరులు పాల్గొన్నారు.