ఈవిఎం గోదాం ను తనిఖీ చేసిన కలెక్టర్ శశాంక

మహబూబాబాద్-సెప్టెంబర్ 20(జనంసాక్షి)

ఈవిఎం గోదామును జిల్లా కలెక్టర్ కె.శశాంక మంగళవారం తనిఖీ చేసారు. ఈవిఎం గోదాము తనిఖీలో భాగంగా ఈవిఎం లు భద్రపరచిన గోదామును, గార్డ్ రిజిష్టర్ ను, సిసి టీవీ పనితీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. భద్రత చర్యలు కట్టుదిట్టంగా ఉండాలని పోలీస్ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. గోదాము అవరణలో చేపట్టిన అంతర్గత రోడ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. అవరణ లో పచ్చదనం ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.ఎలక్షన్ సూపరింటెండెంట్ అనురాధాబాయ్, ఎలక్షన్ డిప్యుటీ సూపరింటెండెంట్ జె.శ్యాం కుమార్,
ఆర్ అండ్ బి ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ జి.తానేశ్వర్, మహబూబాబాద్ తహశీల్దార్ నాగభవాని తదితరులు పాల్గొన్నారు.