Thursday, 5 November 2026

ఈ వ్యర్ధాలను తీసేయండి మహా ప్రభు

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 19
 సాయంత్రంఅయితేచాలుదోమలుచంపుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని స్రవంతి నగర్ సమీపంలో ఐస్ ఫ్యాక్టరీ వెళ్లే రోడ్డు పక్కన శానిటరీ వస్తువులను కుప్పలా వేశారని కాలనీవాసులు ఆరోపించారు. దీంతో వాటిలో వర్షపు నీరు నిలిచి డెంగ్యూ దోమలు తయారై కాలనీవాసులను అనారోగ్యాల పాలుచేస్తూ.ఈ మధ్యనే భరత్ రెడ్డి (22) యువకుడు డెంగ్యూ జ్వరంతో చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని, శానిటరీ వస్తువులలో వర్షపు నీరు నిలిచి డెంగ్యూ దోమలు అభివృద్ధి చెందడంతో కాలనీవాసులుడెంగ్యూజ్వరంపాలైఆసుపత్రులకువెళ్తున్నారనివాపోయారు.సంబంధిత అధికారులు పట్టించుకుని కాలనీ సమీపంలో వ్యర్ధాలుగా వేసిన ఈ శానిటరీవస్తువులను తొలగించాలని కాలనీవాసులు అల్వాల్ డిప్యూటీ కమిషనర్ నాగమణికి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ వ్యర్థంగా వేసిన వస్తువులనుతొలగించకపోయినచో కాలనీ వాసులతో పెద్ద ఎత్తున ఆందోళనచేపడతామనికాలనీకమిటీ
సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ అధ్యక్షుడు, వెంకటరెడ్డి ఉపాధ్యక్షుడు, కరుణాకర్, ఆగమ రెడ్డి, జనరల్ సెక్రెటరీ శంకర్ రెడ్డి, ట్రెజరర్ లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రెటరీ ప్రసన్నకుమార్, తదితరులు ఉన్నారు.
Attachments area