హైదరాబాద్: జమ్ముకశ్మీర్ లోని బారాముల్లాలో ఉగ్రవాదులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక పోలీసు అక్కడికక్కడే మృతి చెందగా జవాను గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడిన మరో పౌరుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కన్జేర్ గ్రామంలోని ఓ ఇంట్లో దాక్కున్న ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో పోలీసులు, సైనికులు ఎదరు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో బారాముల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులు దాక్కున్న ప్రాంతంలో భద్రతాదళాలు భారీగా మోహరించారు. ఉగ్రవాదులు మరికొందరు ఉండవచ్చేమోనన్న అనుమానంతో పోలీసులు గాలింపు చేపట్టారు.




