కెన్యా యూనివర్సిటీలో కాల్పులు

గరిస్సా: కెన్యాలోని ఓ యూనివర్సిటీలో జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. ఈశాన్య కెన్యాలోని గరిస్సా యూనివర్సిటీలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు క్యాంపస్‌లోకి చొచ్చుకొని పోయి జరిపిన కాల్పులకు ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘాతుకం గురువారం తెల్లవారు ఝామున జరిగినట్లు కెన్యా పోలీస్ చీఫ్ బోయ్‌నెట్ తెలిపారు. ఆల్‌ఖైదా సంబంధిత షెబాబ్ ఉగ్రవాదుల పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు.