Tuesday, 3 November 2026

ఉచితంగా కంటి పరీక్షలు చేయడం సామాన్య ,మధ్యతరగతి ప్రజలకు వరం లాంటిది :విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

 ఎల్బీ నగర్( జనం సాక్షి )   ఉచితంగా కంటి పరీక్షలు చేయడం  సామాన్య ,మధ్యతరగతి ప్రజలకు వరం లాంటిదని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనారు.  మహేశ్వరం మండల కేంద్రంలో  ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  ముఖ్యమంత్రి కేసీఆర్  వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ 132 పరీక్షలు ఉచితంగా  చేయటానికి డయాగ్నస్టిక్ లు ఏర్పాటు చేసారు.
నేడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెరిగిన ప్రసవాలు..అమ్మాయి పుడితే 13 వేలు అబ్బాయి పుడితే 12 వేలు,కేసీఆర్ కిట్లు.
కంటి చికిత్స లో ఎల్వి ప్రసాద్  ఆస్పత్రి ప్రసిద్ధి గాంచింది.మహేశ్వరం లో ఉచితంగా కంటి పరీక్షలు,ఉచితంగా కళ్ళద్దాలు,ఆపరేషన్లు చేయటం సామాన్య ,మధ్యతరగతి ప్రజలకు వరం లాంటిది.
ఎల్ వి ప్రసాద్ కంటి  ఆస్పత్రి ఆధ్వర్యంలో మహేశ్వరం మండల ప్రజలకు ఉచితంగా పరీక్షలు,కళ్ళద్దాలు ఇవ్వటం మంచి పరిణామామని,ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి  పిలుపునిచ్చారు.దృష్టి లోపంతో పాటు రెటీన ఇతర అన్ని రకాల పరీక్షలు,ఆపరేషన్లు పూర్తి ఉచితంగా నిర్వహించనున్నట్లు ,ఇవి పేదలకు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ఇంటింటికి వెళ్లి  పరీక్షలు కూడా చేయనున్నట్లు,అవసరం అయిన వారికి ఉచితంగా కళ్ళద్దాలు పంపిణీ చేయనున్నట్లు  మంత్రి తెలిపారు.*
Attachments area