
.గురువారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి మంచిర్యాల జిల్లా శాఖ ఆద్వర్యంలో తలస్సెమియా, సికిల్ సెల్ మరియు సికిల్ తాల్ వ్యాదిగ్రస్తులకు వ్యాధి నిర్ధారణ డి ఎన్ ఏ మెడికల్ రిపోర్ట్లు మరియు బొనెమెరోకి సంబదించిన మెడికల్ రిపోర్ట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి మంచిర్యాల జిల్లా శాఖ ఆద్వర్యంలో ఉచితంగా చేయబడినవి. ఈ మెడికల్ రిపోర్ట్లు ఇవ్వడానికి ముఖ్య అతిధిదులుగా గౌరవ మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ మధుసూదన్ నాయక్ గారు హాజరుకావడం జరిగినది వారి చేతులమీదుగా మెడికల్ రిపోర్ట్స్ వ్యాదిగ్రస్తులకు వారి తల్లి తండ్రులకి అందచేయడం జరిగినది, ఈ సందర్బముగా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ కి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి జిల్లా ఛైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు తలస్సెమియా, సికిల్ సెల్ మరియు సికిల్ తాల్ వ్యాదిగ్రస్తులకు మెడికల్ క్యాంప్ లు ప్రభుత్వ వైద్యుల చే ఉచితంగా నిర్వహించాలని, వ్యాధి నిరోధక టీకాలు అందచేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగినది.అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి మంచిర్యాల జిల్లా మండలాల వారీగా తాసీల్దార్ ఆద్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటి మండల కమిటీలు వేయాలని కోరడం జరిగింది.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ తలస్సెమియా, సికిల్ సెల్ మరియు సికిల్ తాల్ వ్యాదిగ్రస్తుల కొరకు జిల్లా వైధ్యాదికారితో మాట్లాడి మెడికల్ క్యాంప్ లు నిర్వహించాలని సుపరిండెంట్ గారికి తెలిపారు, వ్యాధి నిరోధక టీకాలు సంబంధిత అదికారులతో మాట్లాడి తెప్పించి ఉచితంగా అందిచాలని ఆదేశించారు. రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సేవలను గుర్తించి రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులను అభినందించారు.
రెడ్ క్రాస్ సొసైటి జిల్లా బ్లడ్ బ్యాంక్ వైధ్యులచే డిఎన్ఏ మరియు హెచ్ ఎల్ఏ పరీక్షలపై వ్యాధిగ్రస్తులకు మరియు వారి తల్లిదండ్రులకు అవగాహన పరిచినరు, ఈ కార్యక్రమములో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి జిల్లా ఛైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, జనరల్ ఆసుపత్రి సుపరిండెంట్ Dr.హరిశ్చంద్ర, ఆర్ఎమ్మెశ్రీమ్మన్ నారాయణ, రెడ్ క్రాస్ సొసైటి జిల్లా కోశాధికారి పడల రవీందర్, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు మధుసూదన్ రెడ్డి, కసర్ల శ్రీనివాస్, యెడ్ల కిషన్, తలస్సెమియా వెల్ఫేర్ సొసైటి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కసర్ల రంజిత్ కుమార్ మరియు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది సూపర్వైజర్ మాధవి, తల సేమియా ట్రాన్స్లేషన్ సిస్టర్స్ సంధ్య ,మల్లేశ్వరి, సిబ్బంది మణికంఠ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఉచితంగా టెస్టులు




