ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయం.
కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్.
సిరిసిల్ల. జనవరి 16.(జనం సాక్షి) ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ అన్నారు. సోమవారం 34 వార్డు మేడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా అందించే శిబిరాన్ని స్థానిక కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వైద్య సేవా కార్యక్రమాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో మెడికేర్ హాస్పిటల్ వైద్య బృందం, స్థానిక టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.




