ఉచిత వైద్య శిబిరం
కొండపాక (జనం సాక్షి )జులై21: కొండపాక మండల పరిధిలో బంగారం గ్రామంలో గురువారం నాడు వాసవి, వనిత క్లబ్ సంయుక్త, సంజీవని మల్టీ స్పెషలిస్ట్ సిద్దిపేట వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎంపీపీ రాగల సుగుణ దుర్గయ్య చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్టిన గ్రామం పై మమకారంతో వాసవి క్లబ్ సభ్యులైన సోమశివకుమార్ మా గ్రామంలో వైద్య ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుకు కృషి చేసినందుకు వారికి వైద్య బృందాని అభినందించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ రాగల దుర్గయ్య, ఉప సర్పంచ్ బట్ట వెంకటేష్, నాయకులు గజ్వేల్ కరుణాకర్ రెడ్డి, గొట్టి ఐలయ్య,దుద్దెడ రమేష్ గౌడ్, ప్రధానోపాధ్యాయులు పెద్ద విట్టల్, ఉపాధ్యాయులు నిమ్మ వెంకట రెడ్డి, డాక్టర్లు దీపక్ కుమార్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.