కూకట్ పల్లి జనంసాక్షి జులై 21
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానందనగర్ వార్డు కార్యాలయంలో గురువారం కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ పలు బస్తీ అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా పర్వత్ నగర్, తులసి నగర్, గాయత్రి నగర్, సెంట్రల్ అల్లాపూర్, శివబస్తీలలో సీసీ రోడ్ల కొరకు శంకుస్థాపన చేయనున్నారు. కావున ఇంతగా అల్లాపూర్ డివిజన్ అభివృద్ధి పరుస్తున్న ఎమ్మెల్యే కి భారీ ఎత్తున ఘనస్వాగతం పలుకుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరార, మహిళా కార్యకర్తలు లక్ష్మమ్మ, రేవతి, లక్ష్మి, వార్డు లక్ష్మి, సత్యమ్మ, పర్వీన్ సుల్తానా, సత్యవేణి, ధనలక్ష్మి, పార్వతమ్మ, తదితరులు పాల్గొన్నారు.




