ఉచిత వైద్య శిబిరము

సర్పంచ్ మామిళ్ళ నర్సింలు
దోమ న్యూస్ జనం సాక్షి.

దోమ మండల పరిధిలోని  ఊట్ పల్లి గ్రామంలో గ్రామ ప్రజలకు  శారద హాస్పిటల్ – పరిగి వారి సౌజన్యంతో గ్రామస్తులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఊట్ పల్లి గ్రామ సర్పంచ్ మామిళ్ల నర్సింలు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా గ్రామస్తులకు గర్భిణీలకు వృద్దులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ మామిళ్ల నర్సింలు మాట్లాడుతూ…. ఉచిత వైద్య శిబిరాలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శారద హాస్పిటల్ వారు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లాలు నాయక్,   హాస్పిటల్ ప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.*