Wednesday, 4 November 2026

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.

మల్కాజిగిరి.జనంసాక్షి.మార్చి26.
కాలనీలలో ఏర్పాటు చేస్తున్న
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ అన్నారు.ఆదివారం కృప కాంప్లెక్స్ దగ్గర సెనాయి నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కార్పొరేటర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.వైద్య శిబిరంలో 200 మందికి పైగా బిపి,షుగర్ తో పాటు జనరల్ చెకప్ చేసి వారికి ఉచితంగా మందులను అందజేశారు.వైద్య శిబిరంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న వారికి ఐడెంటి కార్డులను అందజేశారు.ఈకార్డులు పొందినవారికి హాస్పటల్ లో చికిత్స పొందాలనుకుంటే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుందని హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు.ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈకార్యక్రమంలో డాక్టర్ అర్జున్ దీన్ ద యాల్,డాక్టర్ అనిత దీన్ దయాల్, మచ్చేందర్ యాదవ్,రాజీవ్,శరత్, నందు,కిషన్ తదితరులు పాల్గొన్నారు.