ఉత్తమ ఉపాధ్యాయులకు,ఎమ్మార్సీ సిబ్బందికి సన్మానం
కేసముద్రం సెప్టెంబర్ 6 జనం సాక్షి/ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్థానిక రెడ్డి సంక్షేమ సంఘం భవనంలో మంగళవారం మండల నోడల్ ప్రధానోపాధ్యాయులు కె జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మండలంలోని 20 మంది ఉత్తమ ఉపాధ్యాయులను,ఎం ఆర్ సి సిబ్బందిని ఘనంగా సన్మానించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ ఓలం చంద్రమోహన్ ,విశిష్ట అతిధులుగా మండల పరిషత్ అభివృద్ధి అధికారిని రోజా రాణి, కేసముద్రం జడ్పిటిసి శ్రీ రావుల శ్రీనాథ్ రెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు బీరం జనార్దన్ రెడ్డి, చీకటి వెంకట్రాం నర్సయ్య,రాగి సోమ నర్సయ్య చారి, శ్రీధర్,మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ చంద్రమోహన్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ప్రత్యక్షంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపు కోలేక పోయాము ఇప్పుడు ఘనంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించుకోవడం మరియు జిల్లాస్థాయిలో మన మండలం నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా పలువురు ఎంపిక రావడం మన మండల ఉపాధ్యాయులకు గర్వకారణం అని కొనియాడారు.