Wednesday, 4 November 2026

ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు అందుకున్న మద్దెలబండ 

మల్దకల్ మార్చి 24 (జనంసాక్షి) మండలంలోని ఉత్తమ గ్రామ పంచాయతీగా మద్దెలబండ,ఉత్తమ సర్పంచ్ కొత్తింటి జయమ్మ,ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు 2023 జాతీయ పంచాయతీ పురస్కారం బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డుకు ఎంపిక అయింది.శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఎంపీపీ వై రాజారెడ్డి,వైస్ ఎంపీపీ పెద్దవీరన్న,సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి చేతుల మీదుగా అవార్డు షీల్డ్ అందుకున్నారు. గ్రామ సర్పంచ్ కొత్తింటి జయమ్మ,పంచాయతీ మారెప్పలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అవార్డుకు సహకరించినగ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలకు,సిబ్బందికీ సర్పంచ్ కొత్తింటి జయమ్మ ధన్యవాదములు తెలిపారు.