జహీరాబాద్ , ఆగస్ట్ 15 (జనంసాక్షి): కొహిర్ మండల పరిధిలోని పిచెర్యగడి గ్రామ ఉత్తమ సర్పంచ్ అవార్డ్ కు గ్రామ సర్పంచ్ రవి కిరణ్ అవార్డు అందుకున్నారు.ఈ సందర్భంగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని గ్రామ సర్పంచ్ రవి కిరణ్ అన్నారు. సోమవారం రోజున స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంత్రి మహముద్ అలి చేతుల మీదుగా ప్రశంస పత్రంను అందుకున్నారు. ఉత్తమ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా అవార్డ్ రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఉత్తమ గ్రామ సర్పంచ్ అవార్డ్ అందుకున్న రవి కిరణ్




