హుస్నాబాద్ రూరల్ ఆగస్టు 15(జనంసాక్షి) హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలోని ఆర్డీవో జయచంద్రారెడ్డి ఛాంబర్ ఎదుట సీనియర్ జర్నలిస్ట్ కందారపు రమేశాచార్యులు నేలపై కూర్చొని నిరసన తెలిపారు. స్వాతంత్య్ర వేడుకలకు గతంలో విలేకరులకు ఆహ్వాన లేఖ పంపే సంస్కృతిని ఆర్డీవో కాలరాయడం పట్ల సీనియర్ జర్నలిస్ట్ కందారపు రమేశాచార్యులు నల్లబ్యాడ్జ్ ధరించి నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. సమాచారమివ్వని విలేకరులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
నేలపై కూర్చుని జర్నలిస్ట్ నిరసన




