విజయవాడ,మార్చి2(జనంసాక్షి): టెన్త్‌లో ఉన్నత ప్రమాణాలతో ఫలితాలు సాధించేలా విద్యార్థులు అర్థవంతమైన చదువులను కొనసాగించాలని డిఇవో న్నారు. నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఇదిలావుంటే విజయవాడ సమతా హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి ప్రతిభా పరీక్షలో గన్నవరం స్రవంతి ఉన్నత పాఠశాల విద్యార్థులు రాణించి బంగారు పతకాలను సాధించినట్లు ప్రిన్సిపల్ కొమ్మినేని రామకృష్ణ తెలిపారు. స్రవంతి ఉన్నత పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో వారికి బహుమతులను అందచేశారు.




