Tuesday, 3 November 2026

అక్రమంగా సరుకులు తరలిస్తే డీలర్‌షిప్‌ల రద్దు

విజయవాడ,మార్చి2(జ‌నంసాక్షి): రేషన్‌ సరుకుఉల అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల అధికారులు హెచ్చరించారు. బియ్యం,  కిరోసిన్‌ ఇలా అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవన్నారు. విజయవాడ రూరల్‌ మండలంలోని ఎనికేపాడు హరిజనవాడలోని రేషన్‌ దుకాణం పరిధిలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 600 లీటర్ల కిరోసిన్‌ను ఇటీవల గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. టాటా ఏస్‌ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న మూడు కిరోసిన్‌ డబ్బాలను గ్రామస్థులు మాటు వేసి పట్టుకున్నారు. సమాచారం తెలుసుకున్న పటమట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆటోని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఇచ్చే ప్రాథమిక సమాచారం ప్రకారం రేషన్‌ దుకాణం డీలరుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమాలకు పాల్పడే డీలర్లను సస్పెండ్‌ చేస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *