ఉత్తమ సేవలు అందించిన నల్లమల 108 అంబులెన్స్ సిబ్బందికి ప్రశంసాపత్రాలు

అచ్చంపేట ఆర్సి, ఆగస్టు 16,( జనం సాక్షి న్యూస్ ); స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలో వివిధ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు సిబ్బంది కి పురస్కార ప్రశంసా పత్రాలను అందజేశారు. ఇందులో భాగంగా వైద్య విభాగంలోని అత్యవసర 108 అంబులెన్స్ సర్వీసు సిబ్బంది ఇటీవలే నల్లమల అటవీ ప్రాంతంలో ఆదివాసీ గర్భిణీ మహిళకు సురక్షితంగా ప్రసవం చేసి తల్లి బిడ్డలు క్షేమంగా ఉండేవిదంగా ఉత్తమ సేవలు కనబర్చి ప్రాణాలు రక్షించిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్ ఇమ్మడి మల్లేశ్, వి సుజాత, పైలట్ వెంకటేష్ ల సేవలను గుర్తిస్తూ ఉత్తమ సేవా ప్రశంసా పత్రాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ,జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, జిల్లా ఎస్పీ మనోహర్, జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ చేతుల మీదుగా అందజేశారు.