హైదరాబాద్,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌కు రూ. 50 కోట్ల ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఉత్తరాఖండ్‌కు రూ. 10కోట్లు తక్షణ సహాయం, పునరావాసాల కేంద్రాలకు రూ. 10 కోట్లు సహాయం చేయనున్నారు. యాత్రికుల వసతి కల్పనకు రూ. 40 కోట్లు కేటాయించనున్నారు. జవాన్లు యాదయ్య, వినాయకం కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున సీఎం ఆర్థిక సహాయం ప్రకటించారు. యాదయ్య, వినాయకం కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.




