ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల వల్ల సహాయక చర్యలకు ఆటంకం

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సహాయ చర్యలకు తీవ్ర అటంకమేర్పడింది. ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇంకా దాదాపు 3వేల మంది యాత్రికులు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు అంచనావేస్తున్నారు. సహాయ చర్యల కోసం వినియోగిస్తున్న హెలికాప్టర్లు వర్షం కారణంగా ఎక్కడిక్కడే నిలిచిపోయాయి.