హైదరాబాద్,(జనంసాక్షి): ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయం కోసం ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారుల సంఘం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. బేగంపేటలోని సీఎం క్యాంప్ కార్యాలయం సమీపంలోని ఆ సంఘం కార్యాలయంలో ఐఏఎస్ అధికారలు సమావేశమై ఉత్తరాఖండ్ వరదలపై చర్చించారు. బాధితులను ఆదుకునేందుకు తమ ఒక రోజు వేతనాన్ని చెక్కుల రూపంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఐఏఎస్ అధికారుల సంఘం తెలిపింది.




