Tuesday, 3 November 2026

ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలి: సీఎం

హైదరాబాద్‌: సమాజంలో మార్పు రావాలంటే ఇంటినుంచే ఆ మార్పు మొదలు కావాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సమాజంలో మార్పులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. 2005 నుంచి 2011 వరకు 70 వేల వరకు బంగారు తల్లులు చనిపోయారని, బంగారు తల్లులను చంపడం సమాజానికి వ్యతిరేకమని సీఎం అన్నారు. నగరంలోని లలితకళాశాతోరణంలో ‘బంగారు తల్లి’ పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడారు. దేశంలో గత 20 ఏళ్లలో పుట్టిన తర్వాత, పుట్టక ముందు తల్లి గర్భంలో కోటీ మంది అడపిల్లలు బలవన్మరణాలకు గురయ్యారన్న సీఎం, బంగారు తల్లులను చంపే హక్కు తల్లిదండ్రులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *