హైదరాబాద్ : ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయార్థం సీపీఐ విరాళాల సేకరణ చేపట్టింది. హిమాయత్‌నగర్‌లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ విరాళాలు సేకరించారు. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు కీచులాటలు మానుకొని బాధితులకు సాయం చేయాలని ఆయన కోరారు. ఉత్తరాఖండ్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగువారిని అదుకోవడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చంద్రశేఖర్ తెలిపారు.




