Wednesday, 4 November 2026

అధిష్ఠానం తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం ఉంది జానారెడ్డి

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలంగాణ ఇస్తుందన్న విశ్వాసం తనకు ఉందని రాష్ట్ర మంత్రి జానారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో పదవులకు రాజీనామాలు చేశామని, అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకొనేందుకు సిద్ధమవుతామని ఆయన చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమనే నమ్మకాన్ని ప్రజల్లో కల్గించడంతోపాటు ప్రజా అకాంక్షను చాటడమే నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటుచేయనున్న బహిరంగ సభ ఉద్దేశమని జానారెడ్డి చెప్పారు. రాయల తెలంగాణ, ప్యాకేజీలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగలేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *