Wednesday, 4 November 2026

ఉత్తర కాశీయాత్రలో చిక్కుకున్న కుషాయిగూడ వాసులు

హైదరాబాద్‌: ఉత్తర కాశీ, చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన యాత్రికుల్లో హైదరాబాద్‌ కుషాయిగూడకు చెందిన 25 మంది ఉన్నారు. కొండచరియలు విరిగిపడ్డాయని, అక్కడి పరిస్థితులపై వస్తున్న వార్తలతో ఇక్కడ ఉన్న కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉత్తరకాశీ యాత్రకు వెళ్లిన నగర వాసులను సురక్షితంగా ఇక్కడకు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 25 మంది ఉండటంతో వారి బంధువులు ఆందోళనతో ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *