Tuesday, 3 November 2026

ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం

హైదరాబాద్: ఉత్తర భారతాన్ని భూకంపం వణికిస్తోంది. బీహార్, ప.బెంగాల్, ఢిల్లీ,జార్ఖాండ్, నేపాల్ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. నేపాల్ కేంద్రంగా భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ పై 7.1భూకంప తీవ్రత నమోదయినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర భారతంలో వచ్చిన ప్రకంపనల వల్ల దక్షిణ భారతంలో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. బహుళ అంతస్థుల నుండి ప్రజలకుబయటకు పరుగులు తీశారు. విజయవాడ బెంజి సర్కిల్ లో భూ ప్రకంనలు వచ్చాయి. కృష్ణా కరకట్ట ప్రాంతంలో భూమి కపించింది. విశాఖలో స్వల్పంగా భూమి కంపించింది. కాకపోతే ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *