Tuesday, 3 November 2026

ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను రెచ్చగొడుతోంది:తమ్మినేని

హైదరాబాద్: ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను రెచ్చగొడుతూ సమస్యను జఠిలం చేస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ధర్నా చేపట్టింది. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43% ఫిట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించకుండా సబ్ కమిటీల పేరుతో కాలయాపన చేయడం తగదని తమ్మినేని హెచ్చరించారు. సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *