హైదరాబాద్, (ఏప్రిల్2): ఉత్సవాల పేరుతో పబ్బం గడుపుకోవడం మందకృష్ణ నైజమని అందుకే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని టీఆర్‌ఎస్ నేత పిడమర్తి రవి ఆరోపించారు.అందుకే అంబేద్కర్ జయంతి ఉత్సవాల పేరుతో రగడ చేస్తున్నాడని ఆయన విమర్శించారు. బీసీ మంత్రి ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ జయంతులను ఘనంగా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.




