నేరేడుచర్ల జనం సాక్షి న్యూస్ :-
ప్రభుత్వ ఉద్యోగులకు ఆశనిపాతంగా మారిన జీఓ నెం653 ను రద్దు చేయాలని టీటీసీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు మంకెన కరుణాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.గురువారం నాడు పత్రికా ప్రకటనలో తెలుపుతూ ఉద్యోగ విరమణ అనంతరం ఫెంక్షన్లు పొందడం ఉద్యోగి హక్కు అని,దశాబ్దాల పాటు చేసిన సేవలకు రిటైర్డ్ అయిన ఉద్యోగులు వారి కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యతని,1982 లోనే సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న సీపీఎఫ్ వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.సీపీఎఫ్ విధానాన్ని రాజస్థాన్ ప్రభుత్వం రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించినట్లు గానే తెలంగాణ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు అండగా ఉండాలని కోరారు.ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు రాచమల్ల శ్రీను,వెంకట రమణ, సునంద,రాంరెడ్డి,నరేందర్ రెడ్డి, కోటయ్య, కవిత,కర్ణాకర్ రెడ్డి, శ్రీనివాస చారీ,ఖాన్ పాల్గొన్నారు.
ఉద్యోగ విరమణ అనంతరం ఫెంక్షన్లు పొందడం ఉద్యోగి హక్కు….మంకెన కర్ణాకర్ రెడ్డి




