– పుల్గం రాఘవరెడ్డి,
కామారెడ్డి ప్రతినిధి మార్చి11 జనంసాక్షి;
ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి , హైదరా బాద్ శాసన మండలి ఉపాద్యాయ MLC కి ఈ నెల 13న జరుగనున్న ఎన్నికలలో
TPUS,తపస్ బలపర్చిన ,జాతీయవాద నాయకులు శAVN రెడ్డి గారికి( 1)మొదటి ప్రాదాన్యతా ఓటు వేసి రాష్ట్రం లోని ఉపాద్యాయ, విద్యారంగ సమస్యల సాధనలో మీ ఆలోచనే వారి ఆచరణగా భావించే AVN రెడ్డి గారిని గెలిపించలని పుల్గం రాఘవరెడ్డి అన్నారు.
ఇంతవరకూ ఉన్న ఉపాద్యాయ సంఘాల MLC లు చేసిన మోసాలకు ,మల్లీ మోసపోకుండా అలాంటి వారికి తగినబుద్ది చెప్పే అవకాశం మీ చేతుల్లో వుందని,ప్రభుత్వ భినామీ సంఘాలుగా చేసిందంతా చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ….
CPS రద్దు చేయిస్తామని అంటున్న వారి మాటలకు మోసపోకుండా , ఓటుహక్కు లేని ఎందరో ఉపాద్యాయుల అశలకు ఇచ్చే (1)మొదటి ప్రాదాన్యతా ఓటు భరోసా AVN రెడ్డి గెలుపుకు కావాలని ,
గతంలో TPUS
కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించి ఉపాద్యాయులఉమ్మడిసర్వీసు నిభంధనలు తెస్తే, తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాట్లాడిందన్నారు. ప్రభుత్వ ఫ్రేండ్లీ సంఘాలు ఏమీ మాట్లాడని, సకాలంలో జీతాలివ్వకున్నా ,పాఠశాలల్లో కనీస వసతులేకున్న మాట్లాడని వారికి మనం వేసే ఓటు మనం కూర్చున్న చెట్టును మనమే నరుక్కున్నట్టవుతుందన్నారు. కామారెడ్డి జిల్లా నుండి నమోదు చేసికున్న ఉపాద్యాయనీ,ఉపాద్యాయులకు TPUS (తపస్) కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన వినమ్రమైన అబ్యర్థన చేస్తున్నాము. AVNరెడ్డి కి మొదటి ప్రాధాన్యతా ఓటు వేయాలని
తపస్ MLC నమూనా బ్యాలెట్ పత్రాన్ని ఉపాద్యాయులకిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాద్యాయసంఘం(TPUS)కామారెడ్డి జిల్లా శాఖ అద్యక్షులు పుల్గం రాఘవరెడ్డి, రాష్ట్ర భాద్యులు భాస్కరా చారి, జిల్లా భాద్యులు లక్ష్మీపతి,ఆంజనేయులు,తగ్లేపల్లి భాస్కర్ ,రమేష్ గౌడ్, ధత్తాచారి,తదితరులు పాల్గొన్నారు.




