Thursday, 5 November 2026

ఉపాధిహామీని నిర్వీర్యం చేసే దిశగా కేంద్రం

జనం సాక్షి 24

కేంద్రం కక్షపూరిత వైఖరితో ఉపాధి పనులకు అడ్డంకులు

మొక్కలు నాటడం, చెట్లు పెంచడం, నీళ్లు పోయాం మీద ఆంక్షలు విధిస్తున్నది

చెరువులలో పూడిక తీసి రైతుల పొలాలకు తరలించడాన్ని ఆక్షేపిస్తున్నది

క్రమంగా ఉపాధిహామీ పనులకు ఎవరూ రాకుండా దానిని ఎత్తేయడం కేంద్రం లక్ష్యంగా అనిపిస్తున్నది

కేంద్ర బృందాలు తెలంగాణ ప్రభుత్వ పనులను ప్రశంసిస్తుంటే కేంద్రప్రభుత్వం మాత్రం ఏదో సాకులు చూపి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది

రైతులకు అందుబాటులో సమృద్దిగా ఎరువులు

ఎక్కడ ఇబ్బంది ఉన్నా నేరుగా నాకు కాల్ చేయండి

పశు వైద్య కేంద్రాల్లో సమస్యల పరిష్కారానికి కృషి

నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించేందుకు వేరుశెనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు

రైతులు అత్యధిక ఉత్పాదకత సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

రూ.5 కోట్లతో టౌన్ హాల్ నిర్మాణం

సర్వ వర్గ సామూహిక భవనాలు, ఎస్టీ తండాలకు రూ.రూ.18.27 కోట్లతో 17 రహదారులు, రూ.1.20 కోట్లతో గిరిజన భవనం

పంచాయతీ రాజ్ శాఖ కింద రూ.17.49 కోట్లతో 30 రహదారుల మరమ్మతులకు అనుమతులు వచ్చాయి .. వెంటనే ప్రారంభించి పనులు పూర్తిచేయాలి

జిల్లాలో కొత్తగా 16,023 ఆసరా ఫించన్లు .. వెంటనే పంపిణీకి చర్యలు తీసుకోవాలి .. వచ్చే నెల నుండి లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు

మహిళా సంఘాలు స్వశక్తితో ఎదిగేలా వారిని ప్రోత్సహించాలి

మామిడిపండ్లు, సీతాఫలాల ఆధారిత ఉత్పత్తులు, పాల ఉత్పత్తులపై మహిళా సంఘాలు దృష్టి సారించాలి

సాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి

ప్రజాప్రతినిధులు కాల్వల వెంట తిరిగి సకాలంలో కాల్వలలో జమ్ము తొలగించడానికి కృషిచేయాలి

చిన్నమారూరు ఎత్తిపోతల పథకం మోటార్లను వెంటనే మరమ్మతు చేసి వారంలో అందుబాటులోకి తేవాలి

108 అంబులెన్స్ ల ద్వారా రోగులను ప్రైవేటుకు తరలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి .. మరోసారి అలాంటి వార్త నా దృష్టికి రావద్దు

వనపర్తి మెడికల్ కళాశాలకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి ఫైనల్ అనుమతులు వచ్చాయి

గిరివికాస్ పథకంలో లబ్దిదారుల ఎంపికపై విచారణకు ఆదేశాలు

వనపర్తి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా గారు, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి గారు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఆశీష్ సాంగ్వాని గారు, జడ్పీ సీఈఓ వెంకట్ రెడ్డి గారు తదితరులు