ఉపాధి హామీ,గ్రామ పంచాయతి 165 పనులపై సామాజిక తనిఖీ.
కోటగిరి సెప్టెంబర్ 20 జనం సాక్షి:- మండల కేంద్రంలో నీ గ్రామపంచాయతీలో 2021-2022 ఆర్ధిక సంవత్సరంలో నిర్వహించిన ఉపాధిహామీ పనులు, సామాజిక తనిఖీ,గ్రామసభ స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా పంచాయతి పరిధిలో జరిగిన 165 పనులను చదివి వినిపించారు.అలాగే ఈ పనులపై తనిఖీ,ఆడిట్ నిర్వహించారు.ఉపాధి హామీ కూలీల వేతనాలు,పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈసమావేశంలో ఈ.ఓ రాజేందర్,ఆడిటర్ అధికారి రజిత,సొసైటీ చైర్మన్ కూచి సిద్దు, గ్రామ ప్రజలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
Attachments area