ఎల్బీ నగర్ (జనం సాక్షి ) రానున్న రోజుల్లో మరిన్ని పతకాలు సాధించి దేశానికి ‘ రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చైతన్యపురి డివిజన్ తెరాస అధ్యక్షులు తోట మహేష్ యాదవ్ అన్నారు .మంగళవారం నాడు తోట మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మోడీ కేసరి (రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్) -2022 అండర్ 120 వెయిట్ విభాగంలోగోల్డ్ మెడల్ సాధించిన లవ కుమార్ , తుల్జా భవాని రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ -2022 లో 61 వెయిట్ విభాగంలో రజత పతకం సాధించిన .సాయిదర్శన్ యాదవ్ , 65 అండర్ వెయిట్ విభాగంలో రజత పతకం సాధించిన అజయ్ ను ‘అండర్ 86 వెయిట్ విభాగంలో రజతం సాధించిన గౌతమ్ సింగ్ ను తోట మహేష్ యాదవ్ వారిని ఘన సన్మానం చేసి అభినందనలు తెలిపారు . అదేవిధంగా జైభవాని రెజ్లింగ్ అకాడమీ విజేతలందరికీ అర్జున్ ఉస్తాద్, అభిమన్యు పెహెల్వాన్, మోతీలాల్ ఖలీఫా( ఎన్ఐఎస్ రెజ్లింగ్ కోచ్)లకు అభినందనలు తెలిపారు .
వివిధ విభాగాల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను ఘన సన్మానం చేసిన : చైతన్యపురి డివిజన్ తెరాస అధ్యక్షుడు తోట మహేశ్ యాదవ్




