సర్పంచ్ ప్రత్యూష రెడ్డి ని సన్మానించిన కడియం శ్రీహరి
స్టేషన్ ఘనపూర్, (చిల్పూర్), సెప్టెంబర్ 19,( జనంసాక్షి ) :
చిల్పూరు మండలంలోని శ్రీపతి పల్లి గ్రామ పంచా యతీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సమా వేశంలో గ్రామ సర్పంచ్ కేసిరెడ్డి ప్రత్యూష మనోజ్ రెడ్డి ఇటీవల లక్నోలో జరిగిన స్మార్ట్ విలేజ్ జాతీ య సర్పంచుల సదస్సుకు స్టేషన్ఘన్పూర్ నియోజ కవర్గం తరఫున హజరైనందున మాజీఉపముఖ్య మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి శ్రీపతిపెళ్లి సర్పం చ్ ప్రత్యూషరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానిం చారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడు తూ గ్రామాన్ని అన్నివిధాల అభివృద్ధిలోముందుం చిన ప్రత్యూష రెడ్డి ని అభినందించారు. పల్లెలు బాగుండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పదంలో ముందుంచా రని,అందులో భాగంగా విద్యావేత్త అయిన సర్పం చ్ ప్రత్యూష రెడ్డి కెసిఆర్ అమలు చేస్తున్నా సంక్షే మ పథకాలు అన్ని అర్హులైన పేదలకు అందేలా కృషి చేస్తున్నారని,అనేక అభివృద్ధి పనులు చేస్తూ గ్రామానికి మంచి పేరు తీసుకు వచ్చారన్నారు. అ నంతరం తమగ్రామ అభివృద్ధికి నిధులు మంజూ రు చేయాలని గ్రామ సర్పంచ్ ప్రత్యూషరెడ్డి కోరగా సానుకూలంగా స్పందించిన కడియం శ్రీహరి నిధు లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. సర్పంచ్ ను కడియం శ్రీహరితో పాటు, ప్రజాప్రతినిధులు, నాయకులు,గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో రూరల్ రైస్మిల్లర్స్ అసోసియేష న్ జిల్లా అధ్యక్షుడు బెలిదె వెంకన్న, జిల్లా గ్రంథాల య చైర్మన్ ఎడవల్లి కృష్ణరెడ్డి, సర్పంచుల ఫోరం చిల్పూర్,స్టేషన్గన్పూర్ మండల అధ్యక్షులుమామి డాల లింగారెడ్డి,పోగుల సారంగపాణి,గ్రామ సర్పం చ్ ప్రత్యూష మనోజ్ రెడ్డి, నాయకులు జనగాం యాదగిరి,రాంబాబు,కరుణాకర్ రావు, మనో జ్ రెడ్డి, నీల గట్టయ్య, అయోధ్య, కొయ్యడ రామ దాసు,టిసమ్మయ్య,భూక్యా సుధాకర్, నరేందర్, రూప్లా నాయక్, రవీందర్, తదితర నాయకులు పాల్గొన్నారు.