Tuesday, 3 November 2026

ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలి

ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలి*రద్దు చేసిన ఉపాధి కూలీల పని అలవెన్స్ లను తిరిగి ఇవ్వాలి* ఏఐకేఎంఎస్-ఐ ఎఫ్ టి యు డిమాండ్
టేకులపల్లి, ఏప్రిల్ 3( జనం సాక్షి): జాతీయ ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని, గత నెల ఫిబ్రవరి వరకు కూలీలకు ఇచ్చిన అలవెన్స్ ని రద్దు చేయడాన్ని విరమించుకొని అలవెన్సులు తిరిగి ఇవ్వాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్  భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు జిల్లా కమిటీలు ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం టేకులపల్లి మండలంలోని దాసుతండా సమీపాన జరుగుతున్న ఉపాధి హామీ కూలీల వద్ద   సర్వే నిర్వహించారు. అనంతరం ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు ఏట్టి నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ గ్రూప్ మీటింగ్లో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల సమస్యలను పరిష్కరించాలని, వారికి కల్పించాల్సిన కనీస సౌకర్యాలను కల్పించడం లేదని, కనీసం వారికి రోజుకి 7,8 రూపాయలు కూలి పడుతుందని దీనితో వారి యొక్క జీవనo ఎలా కొనసాగుతుందో ప్రభుత్వాలు పాలకులే చెప్పాలని వారన్నారు. గత  ఫిబ్రవరి వరకు కూలీలకు అలవెన్స్ ల కింద పారకు, గడ్డపారకు,తట్టలకు,మంచినీరుకి, ఇచ్చే వారని,ఇపుడు అవి కూడా రద్దు చేశారని వారు అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న,ఏపీవోలు,టెక్నికల్ అసిస్టెంట్ లు, ఇసి లు,ఫీల్డ్ అసిస్టెంట్లు,మేట్ లకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారన్నారు.పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి హామీలకు కూడా రోజుకు 750 రూపాయలు మాస్టర్ కల్పించాలని,365 రోజులు పని కల్పించాలని,కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని,ప్రమాదo జరిగి మరణించిన వారికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, ప్రమాదానికి గురైన వారికి ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య సౌకర్యం కల్పించాలని,ఎండలో పనిచేస్తున్న వారికి ఓఆర్ఎస్,మంచి నీ