జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులపై సోమవారం సామాజిక తనిఖీ గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ గంట పద్మ వెంకట రమణ రెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రామసభలో డి ఆర్ పి రమేష్ పాల్గొన్నారు. నవంబర్ 2020 నుండి మార్చ్ 2023 వరకు సంబంధించి ఉపాధి హామీ పథకం కింద రూ. 85 లక్షల పనులు జరిగాయి. వీటిపై వారు ఆడిటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ శ్రీనివాస్,వార్డ్ సభ్యులు ఇరుగురాల కమల బుస బాపన్న, బిరుదు భాగ్యలక్ష్మి ,ఫీల్డ్ అసిస్టెంట్ పెరవెన కొమురయ్య ,కారోబర్ దొడిపేట కనకయ్య,మైధం శ్రవణ్ ఉపాధి హామి కూలీలు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ గ్రామసభ




